Prathinijam pagati kalagaa
Lyrics: Sirivennela
Music: Koti
ప్రతీ నిజం పగటి కలగా నిరాశగా నిలవనా
ప్రతీ క్షణం కలత పడగా నిరీక్షగా గడపనా
కన్నీటి సంద్రంలో నావనై ఎన్నాళ్ళీ ఎదురీత
ఏనాడు ఏ తీరం ఎదుట కనబడక
ప్రతీ నిజం పగటి కలగా నిరాశగా నిలవనా
ప్రతీ క్షణం కలత పడగా నిరీక్షగా గడపనా
~ సంగీతం ~
పెదవులు మరచిన చిరునగవై నిను రమ్మని పిలిచానా
వెతకని వెలుగుల పరిచయమై వరమిమ్మని అడిగానా
నిదరపోయే ఎదను లేపి నిశిను చూపించగా
ఆశతో చాచిన దోసిట శూన్యం నింపీ
కరగకుమా నా కన్నులనే వెలి వేసి...
ప్రతీ నిజం పగటి కలగా నిరాశగా నిలవనా
ప్రతీ క్షణం కలత పడగా నిరీక్షగా గడపనా
~ సంగీతం ~
ఎక్కడ నువ్వని దిక్కులలో నిను వెతికిన నా కేక
శిలలను తాకిన ప్రతిధ్వనిగా నను చేరితే ఒంటరిగా....
సగములోనే అలసిపోయే పయనమయ్యాగా
ఇసుకను చేసిన సంతకమా నీ స్నేహం..
ఏ అల నిను చేరిపిందో తెలుపదు కాలం..