Hamsa dheevi teeraana (From "Frozen 2"Soundtrack Version)
హంస దీవి తీరాన
హంస దీవి తీరాన
ఉందో నది మాయే గలది
బంగారు తల్లి బజ్జోరా
అన్ని దొరికే నది అది రా
ఆమె గుండే లోతుల్లో
ప్రశ్నలు అన్నీ తొలగే దారుంది
అడిగొస్తావా నువ్వేళ్లి
నేను ఉన్న లేకున్నా నీతో
తానే పాడెను నువ్వింటే
ఆ పాటల్లో మాయుంటుందీ
నీలో భయాన్ని దాచెయ్యవా
వింతవా? ఆ నిజమేంటో
హంస దీవి తీరాన
పారుతున్న నదివే నీవా
సందేహం తీరుస్తావా
అమ్మేమందో చెప్పేస్తావా?