歌手 Saketh Nammavemo

నమ్మవేమో గాని, అందాల యువరాణి,
నేలపై వాలింది, నా ముందే విరిసింది.
నమ్మవేమో గాని, అందాల యువరాణి,
నేలపై వాలింది, నా ముందే విరిసింది.
అందుకే అమాంతం నా మది, అక్కడే నిశబ్దం అయినది.
ఎందుకో ప్రపంచం అన్నది, ఇక్కడే ఇలాగే నాతో ఉంది.
నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది,
అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది.
నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది,
అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది.
నవ్వులు వెండిబాణాలై నాటుకుపోతుంటే,
చెంపలు కెంపు నాణాలై కాంతిని ఇస్తుంటే.
చూపులు తేనె దారాలై అల్లుకుపోతుంటే,
రూపం ఈడు భారాలై ముందర నిల్చుంటే.
ఆ సోయగాన్నే నే చూడగానే, ఓ రాయిలాగా అయ్యాను నేనే.
అడిగా పాదముని అడుగువేయమని కదలలేదు తెలుసా.
నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది,
అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది.
నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది,
అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది.
వేకువ లోన ఆకాశం ఆమెను చేరింది,
ఓ క్షణమైనా అధరాల రంగుని ఇమ్మంది.
వేసవి తాపం చలి వేసి ఆమెను వేడింది,
శ్వాసలలోన తల దాచి జాలిగ కూర్చుంది.
ఆ అందమంతా నా సొంతమైతే, ఆనందమైనా వందేళ్ళు నావే.
కలల తాకిడిని మనసు తాలదిక వెతికి చూడు చెలిమి.
నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది,
అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది.

Parugu 專輯歌曲

歌曲 歌手 專輯
Nammavemo Saketh  Parugu

Saketh 熱門歌曲

歌曲 歌手 專輯
Raja the Great (Title Song) Saketh  Raja the Great (Original Motion Picture Soundtrack)
Nammavemo Saketh  Parugu
Guppeta Saketh  Amar Akbar Antony
發表評論
暱稱 :

驗證碼 : 點擊我更換驗證碼
( 禁止謾罵攻擊! )