Brathakaali
ఫెళ ఫెళ ఫెళమంటూ పిడుగల్లే
పెదవిని తాకింది తొలిముద్దు
సర సర సరమంటూ విషమల్లే
నరనరం పాకింది తొలిముద్దు
గబ గబ గబమంటూ గునపాలై
మెదడును తొలిచింది తొలిముద్దు
ఒక పది వెయ్యికోట్ల సూర్యుళ్ళై
ఎదురుగ నిలిచింది తొలిముద్దు
ఫెళ ఫెళ ఫెళమంటూ పిడుగల్లే
పెదవిని తాకింది తొలిముద్దు
ఒక పది వెయ్యికోట్ల సూర్యుళ్ళై
ఎదురుగ నిలిచింది తొలిముద్దు
వదలనులే చెలి చెలి నిన్నే
మరణం ఎదురు వచ్చినా
మరవనులే చెలి చెలి నిన్నే
మరుజన్మెత్తినా
బెదరనులే ఇలా ఇలా భూమే
నిలువున బద్దలయ్యినా
చెదరదులే నాలో నువ్వే వేసే
ముద్దుల వంతెన
శరీరమంతటిని చీరే
ఫిరంగిలాగ అది మారే
కణాలలో మధురనాళలే
కదిపి కుదుపుతోంది చెలియా
బ్రతకాలి... అని ఒక ఆశ రేగెనే
చంపాలి... వెంటాడే చావునే
బ్రతకాలి... అని ఒక ఆశ రేగెనే
చంపాలి.. . వెంటాడే చావునే
ఫెళ ఫెళ ఫెళమంటూ పిడుగల్లే
పెదవిని తాకింది తొలిముద్దు
ఒక పది వెయ్యికోట్ల సూర్యుళ్ళై
ఎదురుగ నిలిచింది తొలిముద్దు
~ సంగీతం ~
ఒక యుద్ధం ఒక ధ్వంసం
ఒక హింసం నాలో రేగెనే
ఒక మంత్రం ఒక మైకం
నాలో మోగెనే
ఒక జననం ఒక చలనం
ఒక జ్వలనం నాలో చేరెనే
ఒక స్నేహం ఒక దాహం
నాలో పొంగెనే
గతాల చీకటిని చీల్చే
శతఘ్నులెన్నో అది పేల్చే
సమస్త శక్తినిచ్చే నీ స్పర్శే ఓ చెలియా
బ్రతకాలి... అని ఒక ఆశ రేగెనే
చంపాలి... వెంటాడే చావునే
~ సంగీతం ~
ఒక క్రోధం ఒక రౌద్రం
భీభత్సం నాలో పెరిగెనే
ఒక శాంతం సుఖగీతం
లోలో పలికెనే
ఒక యోగం ఒక యజ్ఞం
నిర్విఘ్నం నన్నే నడిపెనే
ఒక బంధం ఒక భాగ్యం
నాకై నిలిచెనే
భయాల గోడలను కూల్చే
జయాల గొంతు వినిపించే
శుభాల సూచనిచ్చే నీ చెలిమే ఓ చెలియా
బ్రతకాలి... అని ఒక ఆశ రేగెనే
చంపాలి... వెంటాడే చావునే
ఫెళ ఫెళ ఫెళమంటూ పిడుగల్లే
పెదవిని తాకింది తొలిముద్దు
ఒక పది వెయ్యికోట్ల సూర్యుళ్ళై
ఎదురుగ నిలిచింది తొలిముద్దు
Oosaravelli 專輯歌曲
歌曲 | 歌手 | 專輯 |
---|---|---|
Brathakaali | Devi Sri Prasad | Oosaravelli |